కావ్య కళ్యాణ్ రామ్ అనే పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాలనటిగా గంగోత్రి, ఠాగూర్‌, బాలు, బన్ని వంటి సూపర్‌హిట్ చిత్రాల్లో స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకుల మెప్పు పొందిన ఆమె, దిల్ రాజు బేనర్‌లో వచ్చిన మసూద సినిమాతో హీరోయిన్‌గా పరిచయమై తొలి సినిమాతోనే బంపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత అదే బ్యానర్‌లో వచ్చిన బలగం చిత్రంతో మరో బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుని తన అభినయంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కావ్య, తన గ్లామర్ ఫోటోషూట్ల ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటూ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. తాజాగా రెడ్ కలర్ డ్రెస్‌లో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె క్యూట్ అండ్ గ్లామరస్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతూ పాజిటివ్ కామెంట్లతో మద్దతు తెలుపుతున్నారు. ప్రస్తుతం కావ్య కళ్యాణ్ రామ్ రెండు కొత్త ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రానుండగా, త్వరలో వాటి వివరాలు వెల్లడించనున్నారు మేకర్స్.

Leave a comment

error: Content is protected !!