ఏప్రిల్ 25న ‘సూర్యాపేట్‌ జంక్షన్‌’ మూవీ గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈశ్వర్‌, నైనా సర్వర్‌ జంటగా నటించగా, ప్రముఖ నటుడు అభిమన్యు సింగ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. యోగాలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై అనిల్ కుమార్ కాట్రగడ్డ, ఎన్. శ్రీనివాసరావు నిర్మాణంలో, రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. గ్లోబల్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ మూవీ విడుదల కానుంది.

హీరో ఈశ్వర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘తెలుగు ప్రేక్షకులు మంచి కథను ఎప్పుడూ ఆదరిస్తారు. అందుకే మంచి కంటెంట్‌తో ఈ సినిమా చేశాం. యాక్షన్ సీన్స్ సహజంగా ఉంటాయి. థియేటర్లలో చూస్తే మమ్మల్ని మెచ్చుకుంటారు’’ అని పేర్కొన్నారు.

ప్రొడ్యూసర్ అనిల్ కుమార్ కాట్రగడ్డ మాట్లాడుతూ, ‘‘మా సూర్యాపేట్ జంక్షన్ మూవీ ఈ నెల 25న ఆంధ్రా, తెలంగాణాలో గ్లోబల్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా గ్రాండ్‌గా విడుదల కావడం గర్వంగా ఉంది. ఈ సందర్భంగా సునీల్ గారికి, రాంమోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం’’ అని తెలిపారు.

ఈ చిత్రానికి సంగీతం రోషన్ సాలూరి, గౌర హరి అందించగా, కెమెరామెన్‌గా అరుణ్ ప్రసాద్, ఎడిటర్‌గా ఎం.ఆర్. వర్మ పనిచేశారు. ఇతర సాంకేతిక నిపుణులుగా శ్రీనివాస్ కోర (కో డైరెక్టర్), ఎ.రహమాన్ (లిరిక్స్), ధనియేలె (పోస్టర్ డిజైనర్), సత్య, రాజేంద్ర భరద్వాజ్ (రైటర్స్), ఎ.పాండు (ఎగ్జిక్యూటివ్ మేనేజర్), పీఆర్ఓలుగా కడలి రాంబాబు, దయ్యాల అశోక్ ఉన్నారు.

Leave a comment

error: Content is protected !!