తెలంగాణా ఫిలిం జర్నలిస్టులు నిత్యం ఫిలిం సర్కిల్‌ లో బిజీగా ఉంటుంటారు. తెలుగు సినిమా ప్రమోషన్స్‌ లో ఈ ఫిలిం జర్నలిస్టుల కృషి చెప్పుకోదగ్గది. అలాంటి జర్నలిస్టుల కోసం స్టార్‌ హాస్పిటల్స్‌ వారి సౌజన్యంతో మల్టీ స్పెషాలిటీ హెల్త్‌ క్యాంప్‌ జరిగింది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణా ఫిలిం డెవలప్‌మెంట్‌ చైర్మన్‌ దిల్‌రాజు , హీరో విశ్వక్‌సేన్ గ్రాండ్‌ గా ప్రారంభించారు.

నిత్యం బిజీగా ఉండే జర్నలిస్ట్‌లకు హెల్త్‌ పట్ల అవగాహన, శ్రద్ద ఎంతో అవసరం.. ఇలాంటి హెల్త్‌ క్యాంపులు ఖచ్చితంగా వారికి ఉపయోగపడతాయన్నారు నిర్మాత ,TFDC చైర్మన్‌ దిల్‌రాజు తెలిపారు.

ఫిలిం జర్నలిస్ట్‌లు మాతో ఎంతో ఫ్రెండ్లీగా, సరదాగా మూవ్‌ అవుతారు.. ఇక ముందు కూడా అదే వాతావరణం కొనసాగాలని కోరారు హీరో విశ్వక్‌సేన్‌. వారు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరారు.

ఈ కార్యక్రమంలో స్టార్ హాస్పిటల్ సి.ఓ.ఓ భాస్కర్ రెడ్డి గారు తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ తో ఒక ఏం.ఓ.యు కుదుర్చుకున్నారు..

Leave a comment

error: Content is protected !!