లూసిఫర్… 2019 లో సంచలనం సృష్టించిన మూవీ. అప్పటి వరకు మళయాళీ మూవీ అంటే.. కంటెంట్ బేస్డ్ మూవీస్.. బడ్జెట్ తక్కువ, కలెక్షన్లు తక్కువే అన్నట్టుగా ఉండేది పరిస్థితి. లూసిఫర్‌తో అద్దిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌తో కమర్షియల్ గా కూడా మల్లు స్టామినాని ప్రూవ్ చేసిన మూవీ ఇది. ఇదే తెలుగులో మెగాస్టార్ రీమేక్ కూడా చేసారు. అయితే ఇప్పుడు ఇదే మూవీ సీక్వెల్ ‘ఎల్2- ఎంపురాన్’.. గా రాబోతుంది. మోహన్‌లాల్ మెయిన్ లీడ్‌తో పృథ్విరాజ్ సుకుమారన్ డైరెక్షన్‌లో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా టీజర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
టీజర్ విషయానికొస్తే… ఇది మంచికి చెడుకు యుద్దం కాదు.. చెడుకు చెడుకు మధ్య జరిగే యుద్దం డైలాగ్‌తో ప్రారంభమై.. యాక్షన్ సీక్వెన్స్‌తో విజువల్ వండర్ ఫీల్‌ని క్రియేట్ చేసింది. స్టీఫెన్ క్యారెక్టర్‌లో మోహన్‌లాల్ స్క్రీన్ ప్రజెన్స్ అద్దిరిపోయింది. స్టీఫెన్ అంటే హిందువుల్లో మహిరావణుడు, ఇస్లాం లో ఇబ్లిస్ , క్రిస్టియానిటీలో మాత్రం లూసిఫర్.. అంటూ మోహన్ లాల్ క్యారెక్టర్ ను అద్భుతంగా ఎలివేట్ చేసారు. కళ్లు చెదిరే యాక్షన్ సీక్వెన్స్‌తో , సూపర్బ్ లొకేషన్స్‌లో టీజర్ ఆద్యంతం యాక్షన్ లవర్స్‌ను ఆకట్టుకుంటుంది. ఫస్ట్ పార్ట్‌లో డైరెక్షన్‌తో పాటు యాక్షన్ ఇరగదీసిన పృధ్విరాజ్ సుకుమారన్ ఈ సినిమాలోనూ విజృంభించాడు. ఈ సినిమా మార్చి 27 న పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ కాబోతుంది.
