నటీనటులు: రామ్ చరణ్-కియారా అద్వానీ-అంజలి- ఎస్.జె.సూర్య-జయరాం-శ్రీకాంత్-సునీల్-సముద్రఖని-నవీన్ చంద్ర-వెన్నెల కిషోర్ తదితరులు
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: తిరు
కథ: కార్తీక్ సుబ్బరాజ్
మాటలు: సాయిమాధవ్ బుర్రా
నిర్మాత: దిల్ రాజు
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శంకర్

ట్రిపుల్‌ ఆర్‌ తో మెగా పవర్‌స్టార్‌ నుంచి గ్లోబల్‌స్టార్‌గా ఎదిగిన రామ్‌చరణ్‌.. భారతీయుడు 2 తో ఫామ్‌ కోల్పోయిన సెన్సేషనల్‌ డైరెక్టర్‌ శంకర్‌.. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా రాబోతుందనగానే అంచనాలు భారీగా పెరిగాయి. శంకర్‌ గేమ్‌ చేంజర్‌తో బౌన్స్‌ బ్యాక్‌ అవుతాడని, పాత శంకర్‌ లా విజృంభిస్తాడనే వార్తలు విజృంభించాయి. ఇక చెర్రీ గేమ్‌ చేంజర్‌తో అన్ని రికార్డ్స్‌ బద్దలు కొడతాడని మెగా ఫ్యాన్స్ ఎదురు చూసారు. మరి వారి అంచనాలను గేమ్‌ చేంజర్‌ రీచ్‌ అయ్యాడా చూద్దాం.

 

కథః విశాఖ పట్నానికి వచ్చిన డైనమిక్ కలెక్టర్‌ రామ్‌ నందన్‌ (రామ్‌ చరణ్) .. వైజాగ్‌లో మంత్రి మోపదేవి ( ఎస్‌జే సూర్య ) చేస్తున్న అక్రమాలన్నింటినీ అడ్డుకుంటాడు. దాంతో వీరిద్దరి మధ్య వైరం తీవ్రస్థాయిలో పెరుగుతుంది. ముఖ్యమంత్రి బొబ్బిలి సత్యమూర్తి (శ్రీకాంత్‌) మరణంతో పరిస్థితులు అనూహ్యంగా మారతాయి. మోపిదేవి కి రావాల్సిన ముఖ్యమంత్రి పీఠం రామ్‌కు దక్కుతుంది. ఎందుకు ఎలా ? ఇందులో కియారా పాత్ర ఏంటి ? అంజలి ఎంతవరకు మెప్పించిందనేది తెరపై చూడాల్సిందే.

విశ్లేషణః గేమ్‌ చేంజర్‌ అనగానే చెర్రీ చెప్పిన ఐయామ్‌ అన్‌ప్రిడిక్టబుల్‌ అనే డైలాగ్ గుర్తొస్తుంది. అసలే శంకర్‌ సినిమా.. పైగా సోషల్ ఎవర్‌నెస్ ఉన్న కథ.. అందులో చెర్రీ హీరో.. దాంతో అన్‌ప్రిడక్టబుల్ అంశాలెన్నున్నాయో.. సినిమా ఏ రేంజ్‌లో థ్రిల్ చేస్తుందో అనే అంచనాలతో ఆడియెన్స్‌ హాల్లో కూర్చుంటారు. అయితే అన్‌ప్రిడిక్టబుల్‌ డైలాగ్‌ తప్ప.. అంతగా క్యూరియాసిటీ పెంచేలా సినిమా సాగదు. శంకర్‌ మార్క్‌ కనిపించదు. చెర్రీ గ్లోబల్‌స్టార్ ఇమేజ్‌ కు తగ్గ మాస్‌ ఎలిమెంట్స్‌ అంతగా వర్కవుట్ కాలేదు. అక్కడక్కడా మెరుపులు మెరిపించినా, భారీగా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నా.. అంచనాలకు తగ్గట్టు సినిమా సాగదు.

నటీనటులుః చెర్రీ ఐపిఎస్ గా, ఐఎఎస్‌ గా అదరగొట్టాడు. డైనమిక్‌ గా హ్యాండ్సమ్‌ గా కనిపించాడు. అంతకంటే ముఖ్యంగా అప్పన్న పాత్రలో అదరగొట్టాడు. చెర్రీ యాక్టింగ్ అదుర్స్‌. కానీ అంతకుమించి అనేలా చెప్పుకోవాల్సింది ఎస్‌జే సూర్య గురించి. మోపిదేవి పాత్రలో సూపర్బ్ పర్‌ఫార్మ్‌ చేసాడు. అంజలి తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. సునీల్, శ్రీకాంత్‌లు పరిధి మేరకు నటించారు.

టెక్నిషియన్స్‌ః శంకర్ డైరెక్షన్‌ అంటే అంతా శంకర్‌ గురించే మాట్లాడతారు. ఆయన చేసే మ్యాజిక్ అలాంటిది. కానీ గేమ్‌ చేంజర్‌ వరకు ఆ మ్యాజిక్‌ అంతగా కనిపించదు. అయితే అదే మ్యాజిక్ మాత్రం తమన్‌ తన మ్యూజిక్‌ తో చేసాడు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ అద్దరగొట్టాడు. ఓవరాల్ గా అన్నీ ఉన్నా అనుకున్నంతగా ఆకట్టుకోని సినిమా గా నిలిచిన సినిమా ‘గేమ్‌ చేంజర్‌’.

రేటింగ్: 3.5/5

Leave a comment

error: Content is protected !!