కొత్త వారితో , కొత్త కాన్సెప్ట్‌తో రాబోతున్న ప్లెజెంట్ ఎంటర్‌టైనర్ ‘కరణం గారి వీధి’. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా తెలుగు ఆడియెన్స్‌ను అలరించబోతుంది. ఈ సినిమాను కిట్టు తాటికొండ, కష్మీరా,రోహిత్, వైశాలి, సునీల్ రావినూతల, శ్రీ గోపి చంద్ కొండ మెయిన్ లీడ్ తో హేమంత్, ప్రశాంత్ సంయుక్త దర్శకత్వంలో సౌత్ బ్లాక్‌బస్టర్ క్రియేషన్స్ బ్యానర్‌పై అడవి అశోక్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్‌ను సీనియర్ నటులు శ్రీ మురళీ మోహన్ గారు లాంచ్ చేసారు.
‘కరణం గారి వీధి’ సినిమా అద్భుతమైన విజయం సాధించాలని, చిత్ర యూనిట్ కి మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకున్నారు మురళీ మోహన్. చిత్ర దర్శక నిర్మాతలు నటీ నటులు ఈసినిమా విజయం పట్ల నమ్మకాన్ని వ్యక్తం చేసారు.