ఉర్దూలో ఓ సేయింగ్ వుంది. దానే దానే పే లిఖా హై ఖానే వాలే కా నామ్. ప్రతీ బియ్యపు గింజపై మన పేరు రాసుంటేనే అది మనకు దక్కుతుంది. అదే విధంగా ఏ సినిమా అయినా రాసుంటేనే దక్కుతుంది లేదంటే ఏదో రకంగా మిస్సవుతుందనే సంఘటనలు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా వున్నాయి. అలాంటివి స్టార్స్‌కు ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా జరిగే అవకాశాలున్నాయి. ఇదే విధంగా క్యూట్ అండ్ లక్కీ ఛార్మ్ సమంత కు కూడా జరిగింది.
ఎవరికైనా పెద్ద దర్శకుల సినిమాల్లో యాక్ట్ చేయాలనుంటుంది. జీన్స్ మూవీకోసం ప్రశాంత్ ఏకంగా ఏడు సినిమాలు వదులుకున్నాడంటే అర్ధం చేసుకోవచ్చు పెద్ద దర్శకుల సినిమాల్లో యాక్ట్ చేస్తే వచ్చే కిక్ ఏంటో. చాలా మంది పెద్ద ఆఫర్స్ వచ్చినపుడు చిన్న సినిమాలను వదులుకోవడం సహజంగానే జరుగుతుంటుంది. ఇక సమంత విషయానికొస్తే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ గర్వించదగ్గ మణిరత్నం డైరెక్షన్లో కడలి మూవీలో ఆఫర్ వచ్చింది. ఇలాంటి ఆఫర్ ని ఎవరూ వదులుకోరు. కానీ సమంత మాత్రం చర్మ సంబంధిత సమస్య కారణంగా ఈ మూవీని మిస్ చేసుకుంది.
ఇదే కాదు… శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఐ మూవీలో కూడా సమంత సెలెక్ట్ అయ్యింది. ఈ మూవీకోసం చైనా షెడ్యూల్ ప్లాన్ చేసిన టైమ్‌కి స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్ కారణంతో పాటు డేట్స్ కూడా అడ్జస్ట్ కాకపోవడంతో ఐ నుంచి తప్పుకుంది. ఇలా మణిరత్నం, శంకర్‌లాంటి ఉద్దండుల డైరెక్షన్లో మూవీ చేసే గోల్డెన్ ఛాన్స్‌ను మిస్సయింది సమంత. ఇక్కడో విషయమేంటంటే.. సమంత వదులుకున్న ఈ రెండు సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి.