Shopping Cart 0 items - $0.00 0

వచ్చే సంక్రాంతి మీద కన్నేశారా?

 

ఈ సంక్రాంతి పేరు చెప్పి అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు చిత్రాలు బాక్సీఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ నమోదు చేశాయి. అందుకే వచ్చే ఏడాది సంక్రాంతిని కూడా కొన్ని పెద్ద సినిమాలు అప్పుడే టార్గెట్ చేశాయి. కానీ ఇప్పుడు లెక్క మారిపోనుంది. ఎందుకంటే.. వచ్చే సంక్రాంతి సీజన్ ను రాజమౌళి తన క్రేజీ మల్టి స్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ తో కేప్చర్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. నిజానికి ఈ సినిమా ఈ ఏడాది జూలై 30న విడుదలవ్వాలి. కానీ .. షూటింగ్ చాలా నెమ్మదిగా నడుస్తూండడంతో .. జక్కన్న  వచ్చే సంక్రాంతి పై కన్నేశాడని తెలుస్తోంది.

యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలిసారిగా స్ర్కీన్ షేర్ చేసుకోవడమే కాకుండా.. రాజమౌళి దర్శకత్వంలో నటిస్తూండడంతో ఈ సినిమా ఇప్పుడు ఇండియన్ స్ర్కీన్ పైనే క్రేజీ మూవీ అయిపోయింది. బాహుబలి కన్నా ఎక్కువ బడ్జెట్ తో .. అంటే దాదాపు రూ. 450 కోట్లతో నిర్మితమవుతోన్న ఆర్.ఆర్.ఆర్ మూవీ కూడా ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో మల్టీలాంగ్వేజెస్ లో హైయెస్ట్ స్ర్కీన్స్ లో 2021 సంక్రాంతికి  రిలీజ్ అవడానికి సిద్ధమవుతోంది. అందుకే ఈ సినిమా రిలీజ్ టైమ్ కు మిగతా సినిమాలు విడుదలవడానికి ధైర్యం చేయలేకపోతున్నాయని టాక్.  ప్రీ ఇండిపెండెన్స్ పీరియడ్ లో జరిగే ఫిక్షనల్ స్టోరీ తో తెరకెక్కకుతోన్న ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ  ఏ రేంజ్ సక్సెస్ ను చవిచూస్తుందో చూడాలి. 

Leave a comment

error: Content is protected !!