Chithu – Shobhitha : తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని ప్రముఖ నటుడు నాగ చైతన్య మరియు ప్రసిద్ధ నటి శోభిత ధూళిపాళ త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఈ జంట తమ ప్రేమను అధికారికంగా ప్రకటించి, వివాహ నిశ్చితార్థం కూడా పూర్తి చేసుకున్నారు. ఈ జంట తమ వివాహాన్ని డిసెంబర్ 4న జరుపుకోనున్నారు. ఈ విషయాన్ని చైతన్య అత్తమామలు అధికారికంగా ప్రకటించారు.
ఈ జంట ఇటీవల జరిగిన ఏఎన్నార్ జాతీయ అవార్డుల కార్యక్రమంలో హోస్టులుగా పాల్గొని అతిథులను అలరించారు. ఈ కార్యక్రమంలో వారిద్దరి మధుర సంబంధం అందరికీ స్పష్టంగా కనిపించింది. శోభిత ఇటీవల సోషల్ మీడియాలో తన వైజాగ్ నివాసంలోని ఫోటోలను పంచుకోవడంతో పెళ్లి వేడుకకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయనే ప్రచారం జోరందుకుంది. అయితే ఇప్పుడు ఆ ప్రచారం నిజమే అని తేలింది.
నాగ చైతన్య ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ చిత్రంలో నటిస్తున్నాడు. శోభిత బహుభాషా నటిగా కొనసాగుతూ హిందీ సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంటున్నారు. నాగ చైతన్య గతంలో సమంతతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత శోభితతో ప్రేమలో పడ్డారు. ఈ జంట ప్రేమాయణం చాలా కాలంగా మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఎట్టకేలకు వీరి వివాహం ఖరారవడంతో అభిమానులు ఆనందోత్సాహాలతో ఉన్నారు.