SS Rajamouli : భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న మహేశ్‌బాబు, రాజమౌళి కాంబో చిత్రం SSMB29 కి సంబంధించిన వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రం ఒక సాధారణ సినిమా కాదు, ఒక భారీ అడ్వెంచర్ అని చెప్పవచ్చు. ఓ అంతర్జాతీయ ఈవెంట్‌లో మాట్లాడుతూ దర్శకుడు రాజమౌళి ఈ సినిమాలో జంతువుల పాత్ర చాలా కీలకమని చెప్పారు.

“నాకు జంతువులంటే చాలా ఇష్టం. ‘RRR’తో సహా గతంలో నేను తీసిన సినిమాల్లో జంతువులను ఉపయోగించాను. ఒక విషయం అయితే కచ్చితంగా చెప్పగలను. ‘ఆర్ఆర్‌ఆర్’ కంటే ఎక్కువ జంతువులు నా తదుపరి మూవీస్‌లో ఉంటాయి, ఆర్.ఆర్.ఆర్ కన్నా విజువల్ గా ఎంతో గ్రాండియర్ గా ఉంటుంది’ అని అని ఆయన అన్నారు.

రాజమౌళి ఎప్పుడూ సినిమాల్లో సరికొత్త టెక్నాలజీని ఉపయోగించడానికి ప్రసిద్ధి. ‘ఈగ’, ‘బాహుబలి’ వంటి సినిమాలకు ఆయన అందించిన విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు మహేశ్‌బాబుతో చేస్తున్న సినిమా కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ సహాయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్‌ సంస్థ ‘ఏ స్టూడియో’తో కలిసి పనిచేస్తూ, సినిమాకు అద్భుతమైన విజువల్స్ అందించాలని రాజమౌళి భావిస్తున్నారు.

కథకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ఈ సినిమాను రెండు భాగాలుగా తీయాలని చిత్ర బృందం నిర్ణయించింది. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ భారీ బడ్జెట్ సినిమా, ‘ఇండియానా జోన్స్’ సిరీస్‌లా ఒకదాని తర్వాత ఒకటి సీక్వెల్స్‌తో కొనసాగే అవకాశం ఉంది.
మహేశ్‌బాబు ఈ సినిమా కోసం పొడవాటి జుట్టు, గడ్డంతో ఓ కొత్త అవతారంలో కనిపించనున్నారు. అమెజాన్ అడవుల్లో సాగే ఈ అడ్వెంచర్‌లో పలువురు విదేశీ నటులు కూడా నటిస్తున్నారు. భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ జనవరి నుంచి ప్రారంభం కానుంది. ఈ కథ రాయడానికి రచయిత విజయేంద్రప్రసాద్‌ దాదాపు రెండేళ్లు సమయం తీసుకున్నారు. దుర్గా ఆర్ట్స్‌పై కె.ఎల్‌.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘గరుడ’ అనే టైటిల్‌ కూడా పరిశీలనలో ఉంది.

Leave a comment

error: Content is protected !!