Shopping Cart 0 items - $0.00 0

చిరు, వర్మ మూవీ ఎందుకు ఆగిపోయింది?

 

శివ హిట్‌తో రామ్‌గోపాల్ వ‌ర్మ పేరు ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో మార్మోగిపోయింది. సినిమా హిట్టా ఫ్లాపా అన్న విష‌యం పక్క‌న బెడితే వ‌ర్మ సినిమా అంటేనే ఓ క్రేజ్ ఏర్ప‌డింది. అలాంటి వ‌ర్మ డైరెక్ష‌న్‌లో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేస్తే ఎలా వుంటుంది.?నిజానికి చిరు వ‌ర్మ కాంబినేష‌న్‌లో ఎప్పుడో సినిమా రావాల‌సింది. కానీ కొన్ని రీజ‌న్స్ వ‌ల్ల స్టార్ట‌యిన మూవీనే ఆగిపోయింది. అస‌లు విష‌యానికొస్తే నిర్మాత అశ్విని ద‌త్ ఈ కాంబినేష‌న్‌లో ఓ భారీ బ‌డ్జెట్ మూవీ ప్లాన్ చేసాడు. ఇందులో హీరోయిన్ ఉర్మిళ‌. ఈ మూవీ సెట్స్ పై ఉన్న‌పుడే ఇండ‌స్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. రిలీజ్ త‌ర్వాత ఇండ‌స్ట్రీ రికార్డ్‌లు తిర‌గ‌రాస్తుంద‌నే అంచ‌నాలు విప‌రీతంగా ఉండేవి. అనుకున్న‌ట్టుగానే సినిమా షూటింగ్ స్టార్ట‌యింది. మ‌ణిశ‌ర్మ కంపోజ్ చేసిన సాంగ్‌ను చిరు, ఉర్మిళ‌పై షూట్ చేయ‌డం కూడా జరిగింది. అంతా సాఫీగా సాగుతున్న టైమ్‌లో బాంబేలో సంజ‌య్‌ద‌త్ అక్ర‌మాయుధాల కేసునుంచి బెయిల్ పై విడుద‌ల‌య్యాడు. అంతే ఈ ఇన్సిడెంట్‌తో ఈ సినిమా ఆగింది.. బాంబేలో సంజ‌య్ ద‌త్ రిలీజ్‌కు చిరు సినిమా రిలీజ్‌కు లింకేంట‌నే డౌట్ చాలా మందికి ఉండొచ్చు. ఈ సినిమా స్టార్ట్ కాక ముందు సంజ‌య్ ద‌త్‌తో దౌడ్ సినిమా స్టార్ట్ చేసాడు. ఆ త‌రువాత సంజ‌య్ అరెస్ట్ అయి జైలుకు వెళ్ల‌డంతో.. చిరుతో సినిమా స్టార్ట్ చేసాడు వ‌ర్మ‌. అయితే అనుకోకుండా బెయిల్‌పై సంజ‌య్ బ‌య‌ట‌కు రావ‌డంతో చిరు సినిమా ఆపేసి ముంబ‌యి చెక్కేసి దౌడ్ కంప్లీట్ చేసాడు వ‌ర్మ‌. సో ఇలా మెగాస్టార్ వ‌ర్మ మూవీ అర్ధాంత‌రంగా ఆగిపోయింది. ఇలా కంప్లీట్ చేయ‌కుండా మ‌ధ్య‌లో వ‌దిలి వెళ్లినందుకు పత్రికా ముఖంగా చిరుకు సారీ చెప్పాడు వ‌ర్మ‌.ఈ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన మూవీ చూడాల‌ని వుంది 50డేస్ త‌ర్వాత యాడ్ చేసారు. ఈ కాంబినేష‌న్‌లో మూవీ రాక‌పోయినా పాట మాత్రం వ‌చ్చింది.

Leave a comment

error: Content is protected !!