Trisha Krishnan : దక్షిణాది అందాల తార త్రిష కృష్ణన్ ప్రస్తుతం మొరాకోలోని అద్భుతమైన ప్రదేశాలను ఆస్వాదిస్తూ వెకేషన్లో గడుపుతోంది. తన సోషల్ మీడియా అకౌంట్ లో పంచుకుంటున్న ఫోటోలు , వీడియోలు అభిమానులను అలరిస్తున్నాయి. మొరాకోలోని వివిధ ప్రదేశాలను తిరుగుతూ తీసిన ఫోటోలలో త్రిష అద్భుతమైన సహజ సౌందర్యంతో కనిపిస్తోంది.
స్లీవ్‌లెస్ టాప్‌తో కూడిన సరళమైన దుస్తుల నుండి సంప్రదాయ దుస్తుల వరకు వివిధ రకాల దుస్తులలో తమ అందాన్ని ప్రదర్శిస్తోంది. తాజాగా పంచుకున్న ఫోటోలలో త్రిష సంప్రదాయ దుస్తులలో అద్భుతంగా కనిపిస్తోంది. కాళ్ళను మొత్తం కవర్ చేసే స్కర్టు, మ్యాచింగ్ బ్లాక్ కలర్ టీషర్టు, పొడవైన దుస్తులు, బ్లూ కలర్ దుస్తులు వంటివి తన అందాన్ని మరింతగా ఎలివేట్ చేస్తున్నాయి.
త్రిష తన ఫోటోలలో ఎక్కువగా సింపుల్ మేకప్‌తో కనిపిస్తోంది. ఆమె సహజ సౌందర్యమే ఆమెకు అలంకారమని అభిమానులు అంటున్నారు. 41 ఏళ్ల వయసులోనూ త్రిష 30 ఏళ్ల యువతిలా కనిపిస్తోందని అభిమానులు కొనియాడుతున్నారు. వయసుతో పాటు ఆమె అందం రెట్టింపు అవుతుందని వారు అంటున్నారు. వ్యక్తిగత జీవితంలో ఎంతో ఆనందిస్తున్న త్రిష, సినిమా కెరీర్లో కూడా బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె విడా ముయార్చి, విశ్వంభర, గుడ్ బ్యాడ్ అగ్లీ, రామ్, థగ్ లైఫ్ వంటి భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులలో నటిస్తోంది.