Chiyan Vikram : కోలీవుడ్‌లోని విభిన్న పాత్రలకు జీవం పోసే నటుడిగా చియాన్ విక్రమ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. తన ప్రతి పాత్రలోనూ కొత్తగా ప్రయత్నించడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. తన శరీర సౌష్టవాన్ని, ముఖ కవళికలను పాత్ర అవసరాలకు అనుగుణంగా మార్చుకోవడంలో ఆయన నిష్ణాతుడు. ‘ఐ’ సినిమాలో విక్రమ్ మూడు భిన్నమైన పాత్రలను పోషించారు. సన్నగా, బాడీ బిల్డర్‌గా, కురూపిగా ఆయన ప్రదర్శించిన నటన ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ఈ పాత్రల కోసం ఆయన తన ఆహారాన్ని కూడా మార్చుకున్నారు.
పా. రంజిత్ దర్శకత్వంలో వచ్చిన ‘తంగలాన్’ సినిమాలలో విక్రమ్ కేవలం గోచితో నటించారు. నేచురల్ లుక్ కోసం ఆయన గంటల తరబడి ఎండలో ఉండి, తన శరీరాన్ని స్లిమ్ చేసుకున్నారు. ఈ సినిమాలో పాత్రే కనిపిస్తుంది తప్ప విక్రమ్ కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ప్రస్తుతం విక్రమ్ ఎస్. యు. అరుణ్ కుమార్ దర్శకత్వంలో ‘వీర ధీర సూరన్ పార్ట్ 2’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో విక్రమ్, ఎస్. జె. సూర్య, మలయాళీ నటుడు సురాజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలోని ఒక సన్నివేశం గురించి మలయాళీ నటుడు సురాజ్ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
ఈ సన్నివేశంలో విక్రమ్, ఎస్. జె. సూర్యతో కలిసి ఆయన 18 నిమిషాల పాటు సింగిల్ షాట్లో నటించారు. ఇది ఆయన కెరీర్లోనే మరపురాని అనుభవం అని సురాజ్ తెలిపారు. సురాజ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. విక్రమ్ మాస్ కథాంశంతో సినిమా చేస్తున్నందున ఈ చిత్రం మరోసారి ఆయన నటనకు నిదర్శనంగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు.