TG gnanavel : టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన ‘వెట్టయన్ ది హంటర్’ చిత్రం కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా వంటి ప్రముఖ నటులు నటించిన ఈ చిత్రం.. విడుదలైన రోజు నుంచే సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ చిత్ర విజయానికి కారణాలేంటో… దర్శకుడు జ్ఞానవేల్ వివరించారు.
రజనీకాంత్ అభిమానులు ఎప్పుడూ కోరుకునే ఐకానిక్ మూమెంట్స్‌ను ఈ చిత్రంలో జోడించడం దర్శకుడు జ్ఞానవేల్ కు సవాల్. రజనీకాంత్ స్టైల్, మ్యానరిజంలను కథకు అనుగుణంగా జోడించడంలో ఆయన విజయం సాధించారు.

రజనీకాంత్‌కు ఓ ఎలివేషన్ సీన్ చెప్పగానే ఆయన ఎంతో ఉత్సాహంగా స్పందించారు. రజనీకాంత్ అభిమానులు తన నుంచి ఏం కోరుకుంటారో ఆయనకు బాగా తెలుసు. కథనంలో అంతర్లీనంగా ఉండేలా యాక్షన్ సీక్వెన్స్‌లను రూపొందించడం ద్వారా రజనీకాంత్ అభిమానులను ఆకట్టుకున్నారు.  అమితాబ్ బచ్చన్ మరియు రజనీకాంత్ పాత్రల ఘర్షణను ద్వితీయార్ధంలో ఆసక్తికరంగా చిత్రీకరించారు.

రజనీకాంత్ పాత్రను మరింత తటస్థ వైఖరితో ప్రారంభించడం ద్వారా పాత్రల మధ్య సమతుల్యతను కొనసాగించారు.
దేశవ్యాప్తంగా జరిగిన ఎన్‌కౌంటర్ హత్యల గురించి తన అభిప్రాయాలను ఈ చిత్రంలో వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థలోని లోపాలను కూడా ఈ చిత్రం స్పృశిస్తుంది.

పేదలు ఎన్‌కౌంటర్లకు బాధితులవుతున్నారని, సంపన్నులు న్యాయం నుండి తప్పించుకుంటారని తెలిపారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం చిత్రానికి మరో ఆకర్షణ. ఆయన సినిమా సోల్‌ను పూర్తిగా అర్థం చేసుకుని సంగీతాన్ని అందించారు.
‘వెట్టయన్: ది హంటర్’ చిత్రానికి ప్రీక్వెల్ చేయాలనే ఆలోచనను వ్యక్తం చేశారు. ‘జై భీమ్’ తర్వాత సూర్యతో మరో సినిమాకు కలిసి పని చేయాలనే ఆలోచన ఉందని తెలిపారు. తన దగ్గర కొన్ని ప్రాజెక్ట్‌లు ఉన్నాయని, నవంబర్ మొదటి వారంలో వాటి గురించి తెలియజేస్తానని చెప్పారు.

Leave a comment

error: Content is protected !!