Trishul movie : అమితాబ్ బచ్చన్ నటించిన ఐకానిక్ చిత్రాలలో ‘త్రిశూల్’ ఒకటి. చేతిలో చిల్లిగవ్వ లేకుండా పట్టణానికి వచ్చి ఉన్నత స్థానానికి ఎదిగిన విజయ్ అనే వ్యాపారవేత్త పాత్రలో అమితాబ్ నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ చిత్రం అమితాబ్‌తో పలు చిత్రాలు నిర్మించిన ఆనంద్ పండిట్‌కు కూడా ఎంతో ఇష్టం. ఆయన ఈ చిత్రాన్ని 60 సార్లు చూశానని, ఈ కథ తనలో ఎంతో స్ఫూర్తిని నింపిందని చెప్పారు.
ఆనంద్ పండిట్ తన కలను నిజం చేయాలనుకుంటున్నారు. అందుకే గుజరాత్ నుంచి ముంబయికి వచ్చి ‘త్రిశూల్’ సీక్వెల్ కోసం కథను సిద్ధం చేశారు. మాతృకకు యశ్ చోప్రా దర్శకత్వం వహించగా, సీక్వెల్‌కు దర్శకుడెవరో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. అమితాబ్, శశి కపూర్, సంజీవ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అప్పట్లో బాలీవుడ్ బాక్సాఫీస్ ను ఒక ఊపు ఊపింది. ‘త్రిశూల్’ చిత్రం తమిళంలో రజనీకాంత్, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో మిస్టర్ భరత్ గా తెరకెక్కింది. అలాగే.. తెలుగులో శోభన్ బాబు, చరణ్ రాజ్ ప్రధాన పాత్రల్లో ‘మిస్టర్ భరత్’ పేరుతోనే రూపొంది రెండు భాషల్లోనూ మంచి విజయం సాధించాయి.