SinghamAgain trailer : బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగణ్, దర్శకుడు రోహిత్ శెట్టి కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం “సింగమ్ అగైన్”. సింగం సిరీస్ లో ఇది మూడవ చిత్రం. గత రెండు చిత్రాలు బాలీవువుడ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టాయి. ఇందులో ఇంకా అజయ్ గేవ్ గణ్ తో పాటు .. బాలీవుడ్‌లోని అగ్రశ్రేణి నటులు అక్షయ్ కుమార్, రణ్‌వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్ మరియు అందాల భామలు కరీనా కపూర్, దీపికా పదుకొణె కీలక పాత్రలు పోషించారు.

తాజాగా విడుదలైన ట్రైలర్ దాదాపు 4.58 నిమిషాల నిడివితో రోహిత్ శెట్టి ప్రత్యేకమైన ట్రేడ్‌మార్క్ యాక్షన్ సీక్వెన్స్‌లతో ఆకట్టుకుంది. ట్రైలర్ చూస్తుంటే ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో అర్థమవుతుంది. ‘సింగం, సింగం రిటర్న్స్’ కోవలోనే సింగం ఎగైన్ కూడా అత్యధిక వసూళ్ళు రాబడుతుందని చెప్పొచ్చు. ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతోంది.

Leave a comment

error: Content is protected !!