Marko movie : మలయాళం, తెలుగు ప్రేక్షకులను అలరించిన హ్యాండ్సమ్ హీరో ఉన్ని ముకుందన్ నటించిన కొత్త సినిమా ‘మార్కో’. ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్నది. హనీఫ్ అదేనీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది. ఈ చిత్రంలో ఉన్ని ముకుందన్‌తో పాటు యుక్తి తరేజా, అన్సన్ పాల్, రియాజ్ ఖాన్, కబీర్ దుహన్ సింగ్ వంటి టాలెంటెడ్ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని షరీఫ్ ముహమ్మద్ నిర్మించారు.

చిత్రబృందం తమ సోషల్ మీడియాలో ఈ సినిమా డిసెంబర్‌లో విడుదల కాబోతుందని ప్రకటించింది. “ఈ క్రిస్మస్‌కు ఎక్స్‌మస్‌ కేక్‌ను కట్‌ చేసేందుకు సిద్ధంగా ఉండండి” అని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్ని ముకుందన్ ‘గెట్ సెట్ బేబీ’ అనే మరో చిత్రంలో నటిస్తున్నారు. మరి మార్కోగా ఉన్నిముకుందన్ ఏ రేంజ్ లో ఆడియన్స్ ను ఆకట్టుకుంటాడో చూడాలి.

Leave a comment

error: Content is protected !!