Coolie movie : సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ కూలీ. ఈ సినిమా విశాఖపట్నం షెడ్యూల్ షూట్ విజయవంతంగా ముగిసింది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజనీకాంత్‌తో పాటు నాగార్జున, శ్రుతిహాసన్, ఉపేంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రుతిహాసన్ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. రజనీకాంత్ పోర్షన్ ఎప్పుడో పూర్తవగా.. ఇప్పుడు విశాఖపట్నం షెడ్యూల్‌ షూటింగ్ పూర్తయినట్లు శ్రుతి తెలిపింది.

కూలీ చిత్రం తదుపరి షెడ్యూల్ ఈ నెల 15 నుంచి చెన్నైలో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే రజనీకాంత్ సెట్‌లోకి తిరిగి చేరనున్నారు. ఇటీవల చిన్న శస్త్ర చికిత్స చేయించుకున్న రజనీకాంత్ ప్రస్తుతం వైద్యుల సలహా మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో సెట్‌లోకి చేరే అవకాశం ఉంది. కళానిధి మారన్ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Leave a comment

error: Content is protected !!