Maa Nanna super Hero trailer : టాలీవుడ్‌లో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న సుధీర్ బాబు నటించిన తాజా చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’. దసరా కానుకగా అక్టోబర్ 11 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అభిలాష్‌ రెడ్డి కంకర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆర్ణ కథానాయికగా నటించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

‘మా నాన్న సూపర్ హీరో’ చిత్రం తండ్రీ కొడుకుల మధ్య బంధాన్ని అద్భుతంగా చిత్రీకరించింది. డబ్బు కోసం తన కొడుకును అమ్ముకున్న తండ్రి (సాయి చంద్), ఆ తర్వాత జన్మనివ్వలేకపోయినా సుధీర్ బాబును తన కొడుకుగా పెంచుకున్న షాయాజీ షిండే, ఈ ఇద్దరి మధ్య సుధీర్ బాబు ఎలా ఇరుక్కుంటాడు? అనేది కథ. తన పెంచింది తండ్రి జైలుకు వెళ్ళినప్పుడు సుధీర్ బాబు తీసుకున్న నిర్ణయాలు, తన కన్న తండ్రిని కలిసిన తర్వాత ఏం జరిగింది అనేది చిత్రంలో చూపించారు. మరి ఈ సినిమా సుధీర్ బాబు కు ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!