P.Suseela : ప్రముఖ సినీ నేపథ్య గాయని పి.సుశీలకు తమిళనాడు ప్రభుత్వం అత్యున్నత గౌరవమైన ‘కలైజ్ఞర్‌ నినైవు కలైతురై విత్తగర్‌’ పురస్కారాన్ని ప్రదానం చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్‌ చేతుల మీదుగా ఈ పురస్కారం అందజేయబడింది.
శుక్రవారం చెన్నైలోని సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో పి.సుశీలకు రూ.10 లక్షల నగదు బహుమతితో పాటు జ్ఞాపికను అందజేశారు.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి స్మారకంగా ఏర్పాటు చేసిన ఈ పురస్కారం, కళారంగంలో అత్యున్నత సేవలందించిన వారికి ప్రదానం చేయబడుతుంది. సెప్టెంబర్ 24న ముఖ్యమంత్రి స్టాలిన్‌, పి.సుశీలను ఈ పురస్కారంతో సత్కరించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తమిళం మాత్రమే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళం వంటి పలు భాషల్లో 20వేలకు పైగా పాటలు పాడిన పి.సుశీల, భారతీయ సినీ సంగీతానికి అపారమైన కృషి చేశారు. ఈ పురస్కారం ఆమెకు లభించిన గౌరవం మరింత పెంచింది.

Leave a comment

error: Content is protected !!