Fouzi movie : రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్టులతో అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. కల్కితో సూపర్ సక్సెస్ సాధించిన ప్రభాస్ తదుపరిగా మారుతి దర్శకత్వంలో ‘రాజసాబ్’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ జోరుగా సాగుతుండగా.. అదే సమయంలో హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజి’ అనే వార్ లవ్ స్టోరీలోనూ నటిస్తున్నాడు.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న రాజసాబ్ చిత్రం, ప్రభాస్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవడానికి సిద్ధంగా ఉంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ప్రభాస్ యాక్షన్ సీన్స్‌తో పాటు కొత్త కోణంలో కనిపించనున్నారు.

‘ఫౌజి’ చిత్రం స్వాతంత్రానికి ముందు జరిగిన రజాకార్ల ఉద్యమం నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా. ఈ చిత్రం ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుని, రెండో షెడ్యూల్‌లోకి వెళ్ళింది. ప్రభాస్ లేని సన్నివేశాలను పూర్తి చేసే పనిలో యూనిట్ బిజీగా ఉంది. అయితే, ప్రభాస్ డిసెంబర్ నుండి షూటింగ్‌లో జాయిన్ అవుతారని సమాచారం.

రెండు చిత్రాలకు సంబంధించిన సంగీత పనులు కూడా జోరుగా సాగుతున్నాయి. రాజసాబ్ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, ఫౌజి చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ అందించిన రెండు పాటలు చాలా బాగా వచ్చాయని, హను రాఘవపూడి ఆయన పనితీరుపై చాలా సంతోషంగా ఉన్నారని యూనిట్ వర్గాలు తెలిపాయి.

Leave a comment

error: Content is protected !!