Raviteja : మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. కొత్త దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా శ్రీలీల నటిస్తున్నారు. రవితేజ ఈ సినిమాలో రైల్వే పోలీస్‌ ఫోర్స్‌ (ఆర్పీఎఫ్‌) అధికారిగా కనిపించనున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది.

కొంతకాలం క్రితం ఈ చిత్రం షూటింగ్ సమయంలో రవితేజ గాయపడటంతో షూటింగ్‌ను నిలిపివేశారు. గాయం నుంచి కోలుకున్న రవితేజ తిరిగి సెట్స్‌కు చేరుకోవడంతో ఈ నెల 14 నుండి కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లో రవితేజతో పాటు మిగతా ముఖ్య తారాగణంపై టాకీ పార్ట్‌ చిత్రీకరించనున్నారు.

వచ్చే ఏడాది వేసవి కాలంలో ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ‘ధమాకా’ సినిమా తర్వాత రవితేజ, శ్రీలీల కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది కావడంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రవితేజ తన కెరీర్‌లో ఎన్నో విభిన్న పాత్రలు చేశారు. ఈ సినిమాలో ఆయన చేస్తున్న రైల్వే పోలీస్‌ అధికారి పాత్ర ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!