Rajanikanth : సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా మరోసారి ఆరోగ్య సమస్యతో ఆసుపత్రి పాలయ్యారు. అనూహ్యంగా వచ్చిన కడుపు నొప్పితో బాధపడుతున్న రజనీకాంత్‌ను కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలియగానే అభిమానులు ఆందోళన చెందారు. అయితే, వైద్యులు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, కంగారు పడాల్సిన అవసరం లేదని తెలిపారు.
వైద్యులు రజనీకాంత్‌కు తక్షణమే సర్జరీ చేశారు. లోవర్ అబ్డామినల్లో చిన్న స్టంట్ వేయడం జరిగింది. ఆపరేషన్ విజయవంతంగా ముగియడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. వైద్యులు మరో 2-3 రోజుల్లో రజనీకాంత్‌ను డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. ఈ విషయాన్ని రజనీకాంత్ భార్య లత కూడా ధృవీకరించారు.
ప్రస్తుతం రజనీకాంత్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమా చేస్తున్నారు. అంతేకాకుండా, వెట్టయాన్ సినిమా పోస్ట్-ప్రొడక్షన్ పనులు మరియు ప్రచార కార్యక్రమాలలో కూడా బిజీగా ఉన్నారు. ఈ బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది.