Malavika Mohanan : తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి మాళవిక మోహనన్ తన కెరీర్‌లో మరో కొత్త అడుగు వేయబోతుంది. త్వరలో విడుదల కానున్న ‘సర్దార్ 2’ చిత్రంలో తాను పోషించిన పాత్ర గురించి ఆమె ఆసక్తికర విషయాలను వెల్లడించింది. కార్తీ హీరోగా నటిస్తున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌లో మాళవిక తన పాత్ర చాలా విభిన్నంగా ఉండబోతుందని ఆమె తెలిపింది.

ఇప్పటివరకు తాను చేసిన ఏ పాత్రకూ ఇది భిన్నమైనదని, ఈ పాత్రను తెరపై చూడాలనే ఆసక్తి తనలో ఎక్కువగా ఉందని పేర్కొంది. ‘సర్దార్ 2’ చిత్రంలో ఎస్‌జే సూర్య, ఆషికా రంగనాథ్, రజీషా విజయన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పి ఎస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. మరోవైపు, మాళవిక ప్రస్తుతం ప్రభాస్‌తో కలిసి ‘రాజా సాబ్‌’ చిత్రంలో నటిస్తోంది.

Leave a comment

error: Content is protected !!