Pujahegde : తెలుగు తెరపై ఇటీవల కాలంలో కనిపించడం తగ్గినప్పటికీ, తమిళ సినిమాల్లో పూజా హెగ్డే దూసుకుపోతోంది. ప్రస్తుతం సూర్య సరసన నటిస్తున్న ఆమె, త్వరలోనే దళపతి విజయ్‌ సరసన కూడా నటించనున్నట్లు సమాచారం. ఆల్రెడీ ఇంతకు ముందు ఆమె బీస్ట్ అనే మూవీలో విజయ్ కు జోడీగా నటించిన సంగతి తెలిసిందే.

విజయ్‌ నటిస్తున్న 69వ చిత్రానికి హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం నటీనటుల ఎంపిక పూర్తయింది. బాలీవుడ్‌ నటుడు బాబీ దేవోల్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. కథానాయికగా పూజా హెగ్డే పేరు బలంగా వినిపిస్తోంది. అంతేకాకుండా, ‘ప్రేమలు’ ఫేమ్‌ మమితా బైజు కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయాలపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. పూజా హెగ్డే తమిళంలో వరుస అవకాశాలను అందుకుంటూ తన కెరీర్‌ను మరింత ఎత్తుకు తీసుకువెళుతున్నట్లు తెలుస్తోంది.

Leave a comment

error: Content is protected !!