Ramgopal Varma :  ఈటీవీ ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ హీరోగా టాలీవుడ్ లో అరంగేట్రం చేస్తూ నటిస్తున్న చిత్రం “రామ్ నగర్ బన్నీ”. ఈ సినిమాకి శ్రీనివాస్ మహత్ దర్శకుడు. చంద్రహాస్ తన నటనపై నమ్మకంతో ఉన్నాడు. సినిమా నచ్చకపోతే ప్రేక్షకులకు టికెట్ డబ్బులు తిరిగి ఇస్తానని ఆయన చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది. ఈ ధైర్యమైన నిర్ణయం అతనిలోని ఆత్మవిశ్వాసాన్ని తెలియజేస్తుంది.

ఈ సినిమా ఈ నెల 4న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  చంద్రహాస్ ప్రామిసింగ్ గా ఉన్నాడని, ఈ సినిమా చంద్రహాస్‌తో పాటు ప్రభాకర్‌కు పెద్ద సక్సెస్ ఇవ్వాలని రామ్ గోపాల్ వర్మ ఆకాంక్షించారు.

నిర్మాత దామోదర ప్రసాద్ చంద్రహాస్ ప్రభాకర్ కంటే ఇంకా ఎక్కువ గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకున్నారు. డైరెక్టర్ శ్రీనివాస్ మహత్ చంద్రహాస్ ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడ్డాడని, డ్యాన్స్, ఫైట్స్, పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడని చెప్పారు. రామ్ గోపాల్ వర్మ తనను ప్రశంసించినందుకు సంతోషించారు. సినిమా లాభాల్లో 10% ఛారిటీకి ఇస్తానని, సినిమా నచ్చకపోతే ప్రేక్షకులకు టికెట్ డబ్బులు రిటర్న్ ఇస్తానని ప్రకటించారు.

Leave a comment

error: Content is protected !!