Vettaiyan : దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రాల జాబితాలో ‘వేట్టయన్‌’ కూడా ఒకటి. సూపర్ స్టార్ రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 10న విడుదల కానుంది. తమిళనాడులో జరిగిన ఓ బూటకపు ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం రజనీకాంత్‌కు 170వ చిత్రం. ఆయన ఈ సినిమాలో రిటైర్డ్‌ పోలీసు అధికారిగా కనిపించనున్నారు.

సెన్సార్‌ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్‌ ఇచ్చింది. సినిమా రన్‌టైం 2 గంటల 43 నిమిషాలు. కొన్ని సంభాషణలపై సెన్సార్‌ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేయడంతో చిత్ర బృందం వాటిని మార్చాల్సి వచ్చింది. అమితాబ్‌ బచ్చన్‌, ఫహాద్‌ ఫాజిల్‌, రానా, రితికా సింగ్‌, మంజు వారియర్‌, దుషారా విజయన్‌ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.

తెలుగు ప్రేక్షకుల కోసం ఈ చిత్రం అదే పేరుతో విడుదల కానుంది. అక్టోబర్ 2న ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ఈ సినిమా రజనీకాంత్‌ ఇమేజ్‌కు పూర్తి భిన్నమైందని చిత్ర బృందం పేర్కొంది. ప్రముఖ నటుడు రానా మరియు సంగీత దర్శకుడు అనిరుధ్‌ వేర్వేరు ఇంటర్వ్యూల్లో ఈ విషయాన్ని వెల్లడించారు.

Leave a comment

error: Content is protected !!