Sarwa 37 : యూత్ స్టార్ శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం కేరళలో షూటింగ్ జరుపుకుంటోంది. ‘శర్వా 37’ గా పిలుచుకుంటున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి.

శర్వానంద్ మరియు సాక్షి వైద్యలపై చిత్రీకరించిన ఓ ప్రత్యేకమైన పాట షూటింగ్ పూర్తయింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ కంపోజ్ చేసిన ఈ పాట చిత్రీకరణతో కేరళ షెడ్యూల్ ముగిసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మొత్తం కలిసి ఓ ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఈ చిత్రంలో శర్వానంద్‌తో పాటు సాక్షి వైద్య, సంయుక్త మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ‘సామజవరగమన’ వంటి సూపర్ హిట్ తర్వాత రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతుందని చిత్ర యూనిట్ తెలిపింది.

 

Leave a comment

error: Content is protected !!