Pujahegde : గతేడాది ఒకే ఒక హిందీ సినిమా ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’ లో నటించిన అందాల పూజా హెగ్డే ఈ ఏడాది మళ్ళీ సినిమాలతో బిజీగా ఉన్నారు. తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ‘సూర్య44’ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం లవ్ అండ్ వార్ నేపథ్యంలోని పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్.

ఈ చిత్రంలో సూర్య ఒక గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనున్నారు. జోజూ జార్జ్ మరియు జయరామ్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. పూజా హెగ్డే తాజాగా ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేసినట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో ‘దేవా’ ,  ‘కాంచన’ వంటి చిత్రాలున్నాయి.

Leave a comment

error: Content is protected !!