Vettaiyan preview : సూపర్‌స్టార్ రజినీకాంత్ తన తాజా చిత్రం ‘వేట్టయన్ – ద హంటర్’తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. టీ.జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించారు. దసరా పర్వదినం సందర్భంగా అక్టోబర్ 10న విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా విడుదలైన ప్రివ్యూ వీడియోలో రజినీకాంత్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోని టాప్ మోస్ట్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా కనిపిస్తారు. తన డ్యూటీలో ఎంతో పవర్‌ఫుల్‌గా వ్యవహరిస్తూ, ఎన్‌కౌంటర్స్‌ను ఎలా చేశారనే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. నేరస్థులు రజినీకాంత్ పేరు చెబితేనే హ‌డ‌లిపోతుంటారు. విల‌న్స్ వేట్టయ‌న్ పేరు చెబితేనే హ‌డ‌లిపోతుంటారు. డీల్ చేయ‌టానికి భ‌య‌ప‌డుతుంటారు.

రౌడీయిజం పేరు చెప్పి ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్న వారిని వేట్టయ‌న్ వేటాడుతుంటాడని ప్రివ్యూ స‌న్నివేశాల్లో చూపిస్తూ వ‌చ్చారు. ఇక ఫ‌హాద్ ఫాజిల్, దుసారా విజ‌య‌న్‌, ప్రతినాయ‌కుడిగా న‌టించిన రానా ద‌గ్గుబాటి, అభిరామి, మంజు వారియ‌ర్‌ పాత్రల‌ను ప‌రిచ‌యం చేశారు. అస‌లు వీళ్ల పాత్రల‌కు, వేట్టయ‌న్‌కు ఉన్న సంబంధం ఏంటి? ఎన్ కౌంట‌ర్ స్పెష‌లిస్ట్‌గా ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్న వేట్టయ‌న్ జీవితంలో ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన్నార‌నే విష‌యాలు తెలుసుకోవాలంటే ‘వేట్టయన్ – ద హంట‌ర్‌’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేక‌ర్స్‌.

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చన్ ఇందులో కీల‌క పాత్రలో న‌టిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో మంజు వారియ‌ర్‌, ఫ‌హాద్ ఫాజిల్, రానా ద‌గ్గుబాటి, రితికా సింగ్‌, దుష‌రా విజ‌య‌న్, రోహిణి, అభిరామి త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్రల్లో న‌టిస్తున్నారు. పేట‌, ద‌ర్బార్‌, జైల‌ర్ చిత్రాల‌కు పుట్ స్టాపింగ్ ట్యూన్ అందించి మెప్పించిన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ర‌విచంద‌ర్ నాలుగోసారి సంగీతం అందించిన సినిమా కావ‌టంతో ‘వేట్టయన్ – ద హంట‌ర్‌’పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

Leave a comment

error: Content is protected !!