Remake of the Day : యాంగ్రీమేన్ రాజశేఖర్ సినీ కెరీర్ లో హృద్యమైన కుటుంబ కథా చిత్రం ‘మనసున్న మారాజు’. డివీవీ దానయ్య, జె.భగవాన్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి ముత్యాల సుబ్బయ్య దర్శకుడు. 2000వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా అప్పట్లో మంచి కమర్షియల్ సక్సెస్ సాధించింది.

లయ కథానాయికగా నటించిన ఈ సినిమాలో రజిత, కోటశ్రీనివాసరావు, ఆశాసైని, మనోరమ, బ్రహ్మానందం ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలోని పాటలు అప్పట్లో ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా నేను గాలిగోపరం అనే పాట ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయింది.

నిజానికి ఈ సినిమా ‘కొట్టారం వీట్టిలే అప్పూట్టన్’ అనే సూపర్ హిట్ మలయాళ చిత్రానికి రీమేక్ వెర్షన్. జయరామ్, శ్రుతి జోడీగా నటించిన ఈ సినిమాకి రాజసేనన్ దర్శకుడు. ఇదే చిత్రాన్ని ఆ తర్వాత తమిళంలో సత్యరాజ్ , ప్రత్యూష జోడీగా సౌండ్ పార్టీగా రీమేక్ చేశారు. ఆ సినిమా కూడా సూపర్ హిట్టైంది.

Leave a comment

error: Content is protected !!