KA movie : తెలుగు సినీ ఇండస్ట్రీ యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం తన కెరీర్‌లో మరో కీలక మలుపు తిరుగుతున్నాడు. ‘రాజావారు రాణిగారు’, ‘ఎస్ ఆర్ కళ్యాణమండపం’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన కిరణ్, తాజాగా ‘క’ అనే పాన్ ఇండియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

1970ల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణగిరి గ్రామంలో జరిగే సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రం రూపొందింది. పీరియాడిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోనుందని మేకర్స్ విశ్వసిస్తున్నారు. సుజీత్‌, సందీప్ అనే ఇద్దరు యువ దర్శకులు ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి దర్శకులుగా అడుగుపెడుతున్నారు.

చిత్రంలో కిరణ్ అబ్బవరం పోస్ట్‌మ్యాన్ పాత్రలో కనిపించనున్నాడు. టీజర్‌లో కనిపించిన ఆయన లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రంలో హీరోయిన్లుగా నయన్ సారిక, తన్వీ రామ్ నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయినట్టు మేకర్స్ అధికారికంగా తెలిపారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం అక్టోబర్‌లో విడుదల అయ్యే అవకాశం ఉంది.

Leave a comment

error: Content is protected !!