Sudheerbabu : నైట్రో స్టార్ సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియా సినిమా ‘జటాధర’. ఈ సినిమా తాజా పోస్టర్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వెంకట కళ్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రం శాస్త్రీయత, పౌరాణికత కలిగి ఉన్న కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకుల ముందు ఉంచుతుందని చిత్ర బృందం తెలిపింది. తాజాగా విడుదలైన సెకండ్‌ లుక్‌లో సుధీర్‌ బైక్‌పై వెళుతుండగా ఆకాశంలో ఒక మహాశక్తి అవతారం గర్జిస్తూ కనిపించడం ఆసక్తికరంగా ఉంది. ఈ దృశ్యం చిత్రంలోని పౌరాణికతకు సంకేతంగా నిలుస్తోంది.

ఈ చిత్రం తనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసిందని, మర్చిపోలేని అనుభవమిదని సుధీర్‌బాబు తెలిపారు. ఈ చిత్రంలో శాస్త్రీయత, పౌరాణికత కలిసి ఉన్న కథను చూసిన ప్రేక్షకులు కొత్త అనుభూతిని పొందుతారని ఆయన అన్నారు. ఈ చిత్రం విజువల్‌గా, ఎమోషనల్‌గా అద్భుతంగా ఉంటుందని ఆయన విశ్వసించారు. ప్రస్తుతం చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే హైదరాబాద్‌లో చిత్రీకరణ ప్రారంభం కానుంది.

Leave a comment

error: Content is protected !!