Shanmukha : టాలీవుడ్‌లో కంటెంట్‌కే ప్రాధాన్యం అనే విషయం మరోసారి నిరూపితమవుతోంది. తాజాగా, ఆది సాయి కుమార్ హీరోగా నటిస్తున్న ‘షణ్ముఖ’ చిత్రం ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తోంది. ‘శాసనసభ’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన సాప్ బ్రదర్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. దర్శకుడు షణ్ముగం సాప్పని, అవికా గోర్‌తో కలిసి ఆది సాయి కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

‘షణ్ముఖ’ చిత్రం ఒక డివోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని ఈ విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే లక్ష్యంతో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ఆది సాయి కుమార్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆది అభిమానులను ఆకట్టుకుంది.

దర్శకుడు షణ్ముగం సాప్పని ఈ చిత్రాన్ని ఒక విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. అద్భుతమైన గ్రాఫిక్స్‌తో ఈ చిత్రం ప్రేక్షకులను అలరించనుంది. ‘షణ్ముఖ’ చిత్రాన్ని దీపావళి కానుకగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. కె.జి.ఎఫ్, సలార్ చిత్రాలకు సంగీతం అందించిన రవి బసూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆది సాయికుమార్ కు ఈ సినిమా మంచి బ్రేకునిస్తుందని భావిస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!