RC 16 : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 16వ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టబోతోంది. ఈ మూవీ వచ్చే నెల నుంచి సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ సినిమా కోసం రామ్ చరణ్ తన లుక్‌ను పూర్తిగా మార్చుకుంటున్నారు. కొత్త లుక్‌లో ఆయన ఎలా కనిపిస్తారో అనేది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు.

ఈ చిత్రానికి ప్రముఖ తమిళ కాస్ట్యూమ్ డిజైనర్ ఏగన్ ఏకాంబరంను ఖరారు చేశారు. ఆయన ఇంతకు ముందు ‘తంగలాన్’ సినిమాకు కాస్ట్యూమ్స్ అందించి విజయం సాధించారు. ఈ సినిమా పీరియాడికల్ నేపథ్యంలో సాగే రా రస్టిక్ చిత్రం. అందుకే ఈ రకమైన సినిమాలకు అనుభవం ఉన్న ఏగన్ ఏకాంబరంను ఈ చిత్రబృందం ఎంచుకుంది. ఈ సినిమా క్రీడా నేపథ్యంలో సాగే కథ. రామ్ చరణ్ ఈ సినిమాలో కుస్తీ వీరుడిగా కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Leave a comment

error: Content is protected !!