Kanguva : తమిళ విలక్షణ హీరో సూర్య నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘కంగువా’. ఈ సినిమా విడుదల తేదీపై స్పష్టత వచ్చింది. తొలుత దసరా కానుకగా విడుదల కావాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. తాజాగా ఈ చిత్రాన్ని నవంబర్ 14న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు.

‘కంగువా’ చిత్రం రెండు భిన్నమైన ప్రపంచాల నేపథ్యంలో సాగే ఆసక్తికర కథాంశంతో రూపొందింది. ఈ చిత్రంలో సూర్య రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. బాబీ డియోల్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో గ్రాఫిక్స్‌కు ఎంతో ప్రాధాన్యం ఇవ్వబడింది.  దాదాపు పదికి పైగా భాషల్లో త్రీడీ వెర్షన్‌లో విడుదల కానుంది. సీజీ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడంతో ఈ చిత్రం విడుదలను వాయిదా వేయాల్సి వచ్చింది. సూర్య ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘కంగువా’ చిత్రం ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!