Remake of the Day : మాస్ మహారాజా రవితేజకు స్టార్ డమ్ తెచ్చిపెట్టిన యాక్షన్ మూవీ ఇడియట్. ఇంతకు ముందు ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం అనే సాఫ్ట్ లవ్ స్టోరీ చేసిన రవితేజను అదే దర్శకుడు పూరీ జగన్నాథ్ ‘ఇడియట్’ తో మాస్ హీరోగా ఎలివేట్ చేశాడు. ఇడియట్ టాలీవుడ్ లో అద్భుతమైన విజయాన్ని సాధించి రవితేజకు హీరోగా మంచి బూస్టప్ ను ఇచ్చింది.

ఇందులోని రవితేజ నేచురల్ యాక్టింగ్ కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. రవితేజ లాంగ్వేజ్ , బాడీ లాంగ్వేజ్ ఎంతో డిఫరెంట్ గా ఉండడంతో జనం బాగా ఆదరించారు. దాంతో ఇడియట్ మూవీ అతని ల్యాండ్ మార్క్ మూవీ అయిపోయింది. ఈ సినిమా విడుదలై ఇప్పటికి 22 ఏళ్ళు అయిపోయింది.

నిజానికి ‘ఇడియట్’ సినిమా కన్నడలో పునీత్ రాజ్ కుమార్ డెబ్యూ మూవీ ‘అప్పు’ అవడం విశేషం. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అప్పు’ మూవీ శాండల్ వుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. బెంగళూర్ లో ఈ సినిమా 200 రోజులు ఆడింది. ఈ సినిమాతో పునీత్ రాజ్ కుమార్ నిక్ నేమ్ అప్పు అయిపోయింది. ఇదే సినిమాను తర్వాత తమిళ్, బెంగాలీ, బంగ్లాదేశ్ లాంగ్వేజెస్ లోనూ రీమేక్ చేశారు.

Leave a comment

error: Content is protected !!