Remake of the Day : అలనాటి అందాల తార జయప్రద తన కెరీర్ బిగినింగ్ లో బాధ్యతగల, బరువు కలిగిన అతి క్లిష్టమైన పాత్రలో నటించిన హృద్యమైన కుటుంబ కథాచిత్రం అంతులేని కథ. చక్కటి కుటుంబ కథలకు, వినూత్నమైన పాత్ర చిత్రణలకు పెట్టింది పేరు తమిళ దర్శకుడు కె. బాలచందర్. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పటి ఆడియన్స్ ను ఎంతగానో అలరించింది. ప్రసాద్ బాబు, శ్రీప్రియ, నారాయణరావు, ఫటాఫట్ జయలక్ష్మి, మరో ముఖ్యమైన పాత్రలో రజనీకాంత్ నటించారు. ఇక ఇందులో అతిథి పాత్రలో కమల్ హాసన్ నటించి మెప్పించారు. తమిళ సూపర్ స్టార్స్ అయిన రజనీ అండ్ కమల్ లకు ఈ సినిమా మొట్టమొదటి తెలుగు చిత్రం అవడం విశేషం. ఈ సినిమా 1976లో విడుదలైంది.

నిజానికి ఈ సినిమా 1974లో రిలీజైన తమిళ సూపర్ హిట్ చిత్రం ‘అవళ్ ఒరు తొడర్ కథై’ కు రీమేక్ వెర్షన్. సుజాత్ మెయిన్ లీడ్ లో నటించిన ఈ సినిమాలో జైగణేశ్, సోమన్ , కమల్ హాసన్, విజయ్ కుమార్, శ్రీప్రియ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. కళై మగళ్ అనే మ్యాగజైన్ లో యం.యస్ పెరమాళ్ రాసిన కథకు ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు కె. బాలచందర్. అప్పటి తమిళ ప్రేక్షకులకు హీరోయిన్ పాత్ర ఎంతగానో నచ్చేసింది. అదే పాత్రను తెలుగులో జయప్రద పోషించడంతో .. ఇక్కడ కూడా అదే రేంజ్ లో ఆమె పాత్రకు మంచి గుర్తింపు లభించింది.

Leave a comment

error: Content is protected !!