Nithin : తెలుగు సినీ ప్రేక్షకులను ముఖ్యంగా తెలంగాణ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయిన చిత్రం ‘బలగం’. ఈ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కమెడియన్ వేణు యెల్దండి. ఇప్పుడు అతని తదుపరి చిత్రానికి సంబంధించి పలు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఈ చిత్రాన్ని నాచురల్ స్టార్ నానితో చేయాలని భావించారు. ‘ఎల్లమ్మ’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే కొన్ని కారణాల వల్ల నాని ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు.

ఇప్పుడు ఈ ప్రాజెక్టును హీరో నితిన్ చేయబోతున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘రాబిన్‌హుడ్’ చిత్రంలో నటిస్తున్నారు. అంతేకాకుండా ‘తమ్ముడు’ అనే చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాత దిల్ రాజు భుజాలపై ఉంచబోతున్నారు. నితిన్-వేణు కాంబినేషన్ లో సినిమా సెట్ అయితే వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. అయితే ఇంకా ఈ ప్రాజెక్ట్ చర్చల దశలోనే ఉండటంతో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్వరలోనే ఈ కాంబినేషన్ గురించి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Leave a comment

error: Content is protected !!