Pooja Hegde : తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక పూజా హెగ్డే మరో కొత్త ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తమిళ సూపర్ స్టార్ రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న హారర్ కామెడీ చిత్రం ‘కాంచన 4’లో పూజ హెగ్డే కథానాయికగా నటించే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాల సమాచారం.

అనుకోకుండా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టినట్లు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చిన పూజ హెగ్డే తక్కువ సమయంలోనే సినీ ప్రియుల్ని మెప్పించింది. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఈమె ఈ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ‘కాంచన 4’ చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుంది.  ‘కాంచన’ ఫ్రాంఛైజీలో రూపొందుతున్న ఈ చిత్రంలో పూజ హెగ్డే ఎంపిక కావడం సినీ ప్రేమికుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎన్నో ప్రేమకథల్లో నటించి మెప్పించిన పూజ హెగ్డే తొలిసారి హారర్ కామెడీ జానర్‌లో నటించనుండటం విశేషం.

ప్రస్తుతం పూజ హెగ్డేతో చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. త్వరలోనే ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. తమిళనాట విశేష ఆదరణ పొందిన ‘కాంచన’ సిరీస్‌కు తెలుగులో కూడా మంచి ఆదరణ ఉంది. ఈ నేపథ్యంలో పూజ హెగ్డే ఈ సిరీస్‌లో చేరడంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉందని సినీ వర్గాలు తెలిపాయి.

Leave a comment

error: Content is protected !!