Swayambhu movie : టాలీవుడ్ యూత్ స్టార్ నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభూ’. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని చారిత్రాత్మక నేపథ్యంలో భారీ ఎత్తున రూపొందిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ దగ్గర నుంచి ప్రేక్షకుల ఆసక్తి ఎంతగానో పెరిగిపోయింది.

నిఖిల్ ఈ చిత్రంలో ఓ వీరుడిగా కనిపించనుండగా, తన యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. కాగా నేడు సంయుక్త మీనన్ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో సంయుక్త ఓ ధీరవతిగా కనిపిస్తోంది. ఆమె అందంతో పాటు తన వీరత్వంతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది.

ఈ చిత్రాన్ని భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్‌లు నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. నభా నటేష్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి ఈ సినిమా నిఖిల్ కు ఏ రేంజ్ లో పేరు తెచ్చిపెడుతుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!