Janakaayitheganaka : విలక్షణ నటుడు సుహాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘జనక అయితే గనక’. ఈ సినిమా తొలుత వినాయక చవితి కానుకగా విడుదల కావాల్సి ఉంది. అయితే, తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన వర్షాలు పడుతుండటంతో ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. దిల్ రాజు వంటి అగ్ర నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

వినాయక చవితి వీకెండ్‌ను మిస్సైన ఈ సినిమా, దసరా పండుగ కానుకగా అక్టోబర్ 12న విడుదల కానుంది. దసరా సీజన్‌లో రజినీకాంత్, గోపీచంద్ వంటి స్టార్ హీరోల సినిమాలు కూడా విడుదల కానుండటంతో పోటీ గట్టిగానే ఉండబోతోంది.

ఈ సినిమా ప్రస్తుత సామాజిక పరిస్థితుల నేపథ్యంలో పిల్లలు కనడానికి భయపడే ఒక కుర్రాడి కథగా రూపొందింది. చివరకి భార్య, సమాజం ఈ కుర్రాడిపై ఎలా ఒత్తిడి తెచ్చారు? ఎవరి ఆలోచన పైచేయి సాధించిందనేది మిగతా కథ. మరి ఈ సినిమా సుహాస్ కు ఏ రేంజ్ లో సక్సెస్ అందిస్తుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!