Remake of the day : రెబెల్ స్టార్ కృష్ణంరాజు, మెగాస్టార్ చిరంజీవి అన్నదమ్ములు గా నటించిన సూపర్ హిట్ చిత్రం ‘ప్రేమతరంగాలు’ . 1980 లో విడుదలైన ఈ చిత్రానికి యస్పి చిట్టిబాబు డైరెక్టర్. సుజాత, జయసుధ హీరోయిన్స్ గా నటించారు. ప్రభు చిత్ర బ్యానర్ పై ఈ సినిమా నిర్మాణం జరుపుకుంది.

నిజానికి ఈ చిత్రం ‘ముఖద్దర్ కా సికందర్’ హిందీ చిత్రానికి రీమేక్ వెర్షన్. అమితాబ్ బచ్చాన్, వినోద్ ఖన్నా హీరోలు గా నటించిన ఈ సినిమా కి ప్రకాష్ మెహ్ర డైరెక్టర్. 1978 లో విడుదలైన ఈ సినిమా బాలీవుడ్ లో కొత్త రికార్డులు నెలకొల్పింది. చక్రవర్తి సంగీతం అందించిన ప్రేమ తరంగాలు చిత్రం లోని పాటలు అప్పటి ఆడియన్స్ ను బాగా మెప్పించాయి. ముఖ్యం గా మనసు ఒక మందారం పాట అయితే ఎవర్ గ్రీన్ హిట్.

Leave a comment

error: Content is protected !!