Coolie movie : దక్షిణాదిన అత్యంత ఎదురుచూస్తున్న చిత్రాలలో ‘కూలీ’ ఒకటి. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ , సూపర్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ఇందులో రజనీకాంత్‌ ‘దేవా’ అనే పాత్రలో కనిపించనున్నారు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రజనీకాంత్‌ ‘కూలీ నెంబర్ 1421’ బ్యాడ్జితో కనిపించడం ప్రత్యేక ఆకర్షణ.

ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శ్రుతిహాసన్, సౌబిన్ షాహిర్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరందరూ రజనీకాంత్‌తో కలిసి తెరపై మరోసారి మెరిసిపోనున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రం విశాఖపట్నంలో షూటింగ్ జరుగుతుంది. కీలక సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ‘కూలీ’ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!