Remake of the Day : నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు తన సినీ కెరీర్ లో ఎన్నో అత్యత్తమ చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆ జాబితాలో కొన్ని ఆయన మాత్రమే నటించ గలిగేవి ఉంటాయి. అలాంటి ఓ అద్భుతమైన కుటుంబ కథా చిత్రం ‘అనుబంధం’. రాధిక, సుజాత హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి ఎ.కోదండరామి రెడ్డి దర్శకుడు. మురళి, తులసి, ప్రభాకర రెడ్డి ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా విడుదలై ఇప్పటికి 40 ఏళ్ళయింది. అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్ అయింది.
నిజానికి ఈ సినిమా 1966లో బెంగాలీలో వచ్చిన ‘ఉత్తర పురుష్’ కు మూలం. ఆ తర్వాత ఇదే సినిమాని 1968 లో తమిళంలో శివాజీ గణేశన్ హీరో గా ‘ఉయరన్ద మనిదన్’ గా రీమేక్ చేశారు.  షావుకార్ జానకి, వాణీశ్రీ హీరోయిన్స్ గా నటించారు. కృష్ణన్ పంజు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తమిళంలోనూ సూపర్ హిట్టయింది. చక్రవర్తి సంగీతం అందించిన అనుబంధం చిత్రంలోని పాటలు ఎవర్ గ్రీన్ హిట్స్ గా నిలిచిపోయాయి. ముఖ్యంగా ఆనాటి ఆస్నేహమానంద గీతం, జుంజుంతారారే, మల్లెపూలు గొల్లుమన్నవి లాంటి పాటలు అప్పటి ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
`

Leave a comment

error: Content is protected !!