Ustad Bhagathsingh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , మాస్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ “ఉస్తాద్ భగత్ సింగ్” . ఈ చిత్రంపై అభిమానుల ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన “గబ్బర్ సింగ్” సినిమా భారీ విజయం సాధించడంతో, ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సూపర్ హిట్ తమిళ చిత్రం తెరి ఆధారంగా హరీశ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

దర్శకుడు హరీష్ శంకర్ అతి తక్కువ సమయంలోనే ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేయడానికి కృషి చేస్తున్నాడు. తాజాగా చిత్ర నిర్మాతలు అందించిన సమాచారం ప్రకారం.. పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే డిసెంబర్ నాటికి షూటింగ్ పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా, చిత్ర యూనిట్ ఒక ప్రత్యేకమైన అప్‌డేట్‌ను విడుదల చేయనుంది. అంటే ఓ స్పెషల్ టీజర్ ను రెడీ చేస్తున్నారట. ఈ వార్తతో పవన్ అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు.

Leave a comment

error: Content is protected !!