Chiyan Vikram : ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో అతిపెద్ద సూపర్ స్టార్‌గా రెబల్ స్టార్ ప్రభాస్‌ను గుర్తించవచ్చు. తన తాజా రెండు చిత్రాలతో దాదాపు 2000 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టి.. ప్రభాస్ రికార్డులు సృష్టించారు. అయితే, ఈ విజయంతో పాటు ప్రభాస్‌పై విమర్శలు కూడా పెరిగిపోతున్నాయి. ఇటీవల బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యాలపై ప్రభాస్ అభిమానులు, పలువురు సెలబ్రిటీస్ మండిపడ్డారు. అయితే మరికొందరు ప్రభాస్ సత్తాను ప్రశంసిస్తున్నారు.

ఈ నేపథ్యంలో వెర్సటైల్ హీరో చియాన్ విక్రమ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విక్రమ్, ప్రభాస్ ఇప్పుడు భారతదేశంలోనే అతిపెద్ద సూపర్ స్టార్ అని, కేవలం తెలుగు స్టార్ మాత్రమే కాదని ప్రశంసించారు. ప్రభాస్ అభిమానులు ఈ వ్యాఖ్యలను ఆనందంతో స్వీకరించారు. విక్రమ్ నటించిన తాజా చిత్రం “తంగలాన్” ప్రమోషన్ల సందర్భంగా విక్రమ్ ఈ వ్యాఖ్యలు చేశారు. విక్రమ్‌, ప్రభాస్‌ల ఇద్దరి అభిమానులు ఈ వార్తను ఆసక్తికరంగా చర్చిస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!