Devara : టాలీవుడ్ లో మరో భారీ అంచనాల మూవీ సిద్ధమవుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ చిత్రం విడుదలకు కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. లేటెస్ట్ గా విడుదలైన కౌంట్‌డౌన్ పోస్టర్‌లో ఈ విషయం స్పష్టంగా తెలుస్తోంది. ‘భయం రూపాలు’ అనే ట్యాగ్‌లైన్‌తో విడుదలైన పోస్టర్‌లో ఎన్టీఆర్ రెండు భిన్నమైన లుక్స్‌లో కనిపిస్తున్నారు.

ఈ పోస్టర్‌ చూస్తుంటే ఎన్టీఆర్ ప్రేక్షకులను ఏ విధంగా అలరించబోతున్నారో అనే ఆసక్తి నెలకొంది. ఎన్టీఆర్‌కు జోడీగా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. నందమూరి కల్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

సముద్రతీరం నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందు తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుని, నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ తన నటనతో మరోసారి ప్రేక్షకులను అలరించబోతున్నారని అభిమానులు ఆశిస్తున్నారు. ‘దేవర’ చిత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరో మైలురాయిగా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!