Rajasaab : రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. తన ఎర్లియర్ మూవీ ‘కల్కి 2898 ఏడి’ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రభాస్.. ప్రస్తుతం మరో ఆసక్తికరమైన చిత్రంతో బిజీగా ఉన్నాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాజాసాబ్’ చిత్రాన్ని కూడా విడుదలకు రెడీ చేసే సన్నాహాల్లో ఉన్నాడు ప్రభాస్.

ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ తన పార్ట్‌ను పూర్తి చేశారు. మిగిలిన కీలక సన్నివేశాల చిత్రీకరణ ఇతర నటీనటులతో కొనసాగుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల, యస్కేయన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఒక రొమాంటిక్ హారర్ కామెడీ డ్రామా. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు, అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ప్రభాస్ తన కెరీర్‌లో ఇలాంటి విభిన్నమైన పాత్రను చేయడం ఇదే మొదటిసారి కావడంతో, ఈ చిత్రంపై అందరిలో ఆసక్తి నెలకొంది. ప్రభాస్ కొత్త లుక్‌లో కనిపించనున్నారని, ఈ చిత్రం అతని కెరీర్‌కు మరో మైలురాయిగా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!