Kubera movie : కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, కింగ్ నాగార్జున హీరోలుగా .. సెన్సిబుల్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న వెరైటీ చిత్రం ‘కుబేర’. ఈ చిత్రం ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న సినిమా అంటేనే ప్రేక్షకుల్లో గ్యారెంటీ హిట్ అనే నమ్మకం ఉంది. ఇప్పుడు ఇంతటి స్టార్‌కాస్ట్‌తో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా హిట్ అవుతుందనే నమ్మకం ప్రేక్షకుల్లో మరింత పెరిగింది.

తాజాగా విడుదలైన జిమ్ సర్బ్ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. బాలీవుడ్‌లో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న జిమ్ సర్బ్, ఈ సినిమాలో ఎలాంటి పాత్ర పోషిస్తున్నారో తెలియాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో  నెలకొంది. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల కానుంది.

Leave a comment

error: Content is protected !!